ఘనంగా సంక్రాంతి సమ్మేళనం
సంప్రదాయ వంటకాలకు పెట్టింది పేరు సంక్రాంతి పండుగ అని, ఈ పండుగ సందర్భంగా చేసే పిండివంటలు పోషక విలువలతో కూడుకొని ఉంటాయని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. తెలుగు సంగమం ఆధ్వర్యంలో సంక్రాంతి సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ మాట్లాడుతూ తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం, తెలుగు వారసత్వం, సంస్కృతి గొప్పతనాన్ని ప్రోత్సహించే కార్యక్రమమని కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని హిమచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గంగిరెద్దుల ఆటపాటలు, హరిదాసుల కోలాటం, జానపద, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళారూపాలు ఎంతగానో అలరించాయి.













