మేము ఊహించిందే జరిగింది : మంత్రి తలసాని
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఈ రోజు నుంచి డ్రామాలు మొదలయ్యాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి జ్వరం అని వార్తల్లో చూశానని, హుజురాబాద్, దుబ్బాకలో అభ్యర్థులకు జరిగినట్లే ఇక్కడ జరుగుతోందని ఎద్దేవా చేశారు. తాము ముందు నుంచి ఇలా జరుగుతుందని ఊహించామని, మునుగోడు ప్రజల దీనిని గమనించాలని సూచించారు. రేపు గుండె నొప్పి రావొచ్చు. ఇలాగే కుటుంబం రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేసి సింపతి క్రియేట్ చేసే ఏడుపులు మొదలవుతాయి. మేము ముందు నుంచి ఇదే చూస్తున్నాం. మేము ఊహించిందే జరిగింది. మునుగోడు అభివృద్ధి ఏ మేరకు చేసామో గమనిచండి. మనకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ డ్రామాలను మునుగోడు ప్రజలు నమ్మకండి. జ్వరం ఒక్కటే కాదు రేపు తన పైన దాడి చేయించుకొని చేతులు కాళ్ళు విరగొట్టుకుంటాడు. మేము స్పష్టమైన మెజారీటీతో గెలుస్తున్నాం అని అన్నారు.













