డిప్యూటీ స్పీకర్ గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవం
తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. పద్మారావు డిప్యూటీ స్పీకర్ అని అధికారికంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్, దానం నాగేందర్, కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ప్రతిపక్ష సభ్యులు కలిసి అభినందనలు తెలియజేశారు.













