టీహబ్ కు జాతీయ పురస్కారం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీహబ్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే జాతీయ అంకుర సంస్థల పురస్కారం 2022 పొందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపికైంది. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాష్ దీన్ని ఆన్లైన్లో అందజేశారు. ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రోత్సాహం, అభివృద్ధికి గాను ఈ పురస్కారం దక్కింది. ఈ విభాగంలో 55 ఇంక్యుబేటర్లు పోటీ పడగా తెలంగాణ విజేతగా నిలించింది. జాతీయ పురస్కారం పొందిన టీహబ్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అభినందించారు.













