డల్లాస్ వెంచర్ క్యాపిటల్ తో టీ హబ్ ఒప్పందం
డల్లాస్ వెంచర్ క్యాపిటల్‌తో టీ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియా ఫండ్ పేరుతో టీ హబ్‌కి డల్లాస్ వెంచర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వనుంది. టీ హబ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డల్లాస్ వెంచర్ సంస్థకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ డల్లాస్ వెంచర్ సంస్థ భారత్‌లో అనేక స్టార్టప్స్ నెలకొల్పిందని తెలిపారు. భారత్‌లో 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఆలోచన గొప్పదని అన్నారు. హైదరాబాద్‌లో సుమారు 6 వేల స్టారప్లు ఉన్నాయి. భారత్ ఆర్థికంగా వృద్ధి చెందుతుందన్నారు. భారత్‌కు పెట్టుబడులు రాబట్టడం కష్టం కాదన్నారు. మంచి ఆలోచన ఉన్న స్టార్టప్‌లకు నిధులు ఇబ్బంది కాదన్నారు. భారత్‌లో మొదటి ప్రైవేటు రాకెట్ టీ హబ్ నుంచే వచ్చిందన్నారు. ధ్రువ స్పేస్ సైతం హైదరాబాద్ నుంచి వచ్చి మొదటి ప్రయొగంలోనే నానో రాకెట్స్‌ని విజయవంతంగా నింగిలోకి పంపించింది అని అన్నారు.













