చికాగోకు టీ -హబ్ సేవలు
అంతర్జాతీయ వేదికలపై దేశీయ స్టార్టప్‌లు అవకాశాలను అందిపుచ్చుకునేలా చికాగోలోనూ తమ సేవలను విస్తరించనున్నామని టీ హబ్ వెల్లడించింది. దేశీయ స్టార్టప్‌లు సవాళ్లను ఎదుర్కొంటూ అంతర్జాతీయంగానూ రాణించేలా టీ హబ్ చికాగో సాయపడుతుందని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఢిల్లీ లో జరిగిన కార్పొరేట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ కార్యక్రమం జరిగింది. కార్పొరేట్ సంస్థలు, టెక్నాలజీ లీడర్లకు టీ హబ్ కార్పొరేట్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ సరైన వేదికగా టీ అభివర్ణించింది. వ్యాపార విస్తరణలో ఆవిష్కరణలను చేజిక్కించుకునేలా కార్పొరేట్లకు వీలు కలుగుతుందన్నారు. ఈ కాంక్లేవ్‌లో 300కు పైగా దేశీయ, 35కు పైగా విదేశీ సంస్థల ప్రతినిధులు హాజరైనట్లుగా తెలిపారు.













