తెలంగాణ కాంగ్రెస్ కు షాక్
తెలంగాణ కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శాసన మండలిలో ఆ పార్టీ ఉనికి కోల్పోయింది. దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ చెందిన నలుగురు సభ్యులు హైదరాబాద్ (స్థానిక సంస్థల) ఎమ్మెల్సీ ఎమ్మెస్ ప్రభాకర్ రావు, మహబూబ్‌నగర్ (స్థానిక సంస్థల) ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, నిజామాబాద్ (శాసనసభ్యుల కోటా) ఎమ్మెల్సీ ఆకుల లలిత, కరీంనగర్ (శాసన సభ్యుల కోటా) ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌లు టీఆర్ఎస్లో కలిసిపోయారు. తమ మండలి పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేయాలని వారు చైర్మన్ స్వామిగౌడ్‌ను కోరగా ఆయన ఆమోదించారు. దీంతో మండలిలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. రెండేళ్ల క్రితం టీడీపీపై ప్రయోగించిన విలీన ఆస్త్రాన్నే ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్‌పై ప్రయోగించింది.













