తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి అందుబాటులోకి : బాలకృష్ణ
మొండి రక్త క్యాన్సర్లకు ఆధునిక కార్-టి సెల్ థెరపీని తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను నూతన సంవత్సరం సందర్బంగా ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. దీంతో పాటు మూలకణ మార్పిడి చికిత్స సహాయ గ్రూపునకు కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ అధునాతన థెరపీని తొలిసారి 60 ఏళ్ల రోగికి వైద్యులు విజయవంతంగా చేయడం అభినందనీయమన్నారు. విదేశాల్లో ఈ చికిత్సకు రూ.2`3 కోట్లు వ్యయం అవుతుందని, ఇక్కడ చాలా తక్కువకే అందుబాటులో ఉందని తెలిపారు. అనంతరం క్యాన్సర్కు చికిత్స పొందుతున్న పిల్లల మధ్య బాలకృష్ణ నూతన సంవత్సర వేడుకలు జరుపుకొన్నారు.













