తెలంగాణ హైకోర్టు కు కొత్త ముగ్గురు న్యాయమూర్తులు.. ప్రమాణం
తెలంగాణ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా నియమితులైన ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అదనపు న్యాయమూర్తులుగా లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, సుజన కలసికంలతో ప్రమాణం చేయించారు. అనంతరం అదనపు న్యాయమూర్తులుగా తమకు కేటాయించిన సీట్లలో ఆసీనులై, సీనియర్ న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌ల్లో కేసులు విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు అడ్వొకేట్ జరల్ బి.ఎస్.ప్రసాద్, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ. నరసింహారెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్‌కుమార్, అదనపు న్యాయమూర్తుల బంధువులు హాజరయ్యారు.













