యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర వేడుకలు
యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షతాన్ని పురస్కరించుకుని విశేష పూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువ జామునే స్వయం భువులను కొలిచిన అర్చకులు ప్రధానాలయ ముఖ మండపంలో కవచమూర్తులకు అష్టోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ముందుగా 108 కలశాలకు పూజలు నిర్వహించారు. పంచసూక్త పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ఠ అలంకార మూర్తులను అభిషేకించారు. తులసీ దశాలతో సహస్ర నామార్చనలు జరిపారు. స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు వేకువ జామునే కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ పాతగట్టు ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.













