ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఊరట
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట కావాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. కవిత పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈడీ న్యాయవాది స్పందన కోరింది. తమకు అభ్యంతరం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నిర్దేశించింది. దీనిపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.













