ఇదే లాస్ట్ ఛాన్స్.. తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
విద్యుత్ ఉద్యోగుల విభజన వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్ర నుంచి రిలీవ్ అయిన 84 మంది పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన విద్యుత్‌శాఖ అధికారులకు జైలుశిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని ధర్మాసనం ఆక్షేపించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు ఇదే చివరి అవకాశమని, రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని అత్యున్నత న్యాయస్తానం ఆదేశించింది.













