హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో గుర్తింపు, సంఘంలో నెలకొన్న పలు అంశాలపై హెచ్‌సీఏ, ఛార్మినార్ క్రికెట్ అసోసియేషన్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్, జాన్ మనోజ్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధులియా ధర్మాసనం విచారణ జరిపి తాజాగా పలు ఉత్తర్వులు జారీ చేసింది. వీలైనంత త్వరగా హెచ్‌సీఏకు ఎన్నికల ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హెచ్‌సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏకసభ్య కమిటీనే ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది. అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చైడాలని న్యాయస్థానం సూచించింది.













