రామప్ప దేవాలయాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
తెలంగాణ రాష్ట్రంలో యునెస్కో గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఎన్వీ రమణకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. రామప్ప ఆలయంలో ఎన్వీ రమణ ప్రత్యేక పూజలు చేశారు. సీజేఐ పర్యటన నేపథ్యంలో అధికారులు ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆయన వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రాష్ట్ర హైకోర్టు ఉన్నతాధికారులు, వరంగల్ కోర్టు ఉన్నతాధికారులు, మానుకోట ఎంపపీ మాలోత్ కవిత, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.













