తెలంగాణ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా.. సునీతారావు

తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా సునీతా రావును నియమితులయ్యారు. ఇంతకు ముందు వరకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా విధులు నిర్వహించిన నేరెళ్ల శారద సేవలను కాంగ్రెస్ అధిష్టానం అభినందించింది. ఆమె స్థానంలో కొత్తగా సునీతారావును నియమిస్తూ ఏఐసీసీ కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సునీతరావు కళాశాల దశ నుంచి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‍ఎస్‍యూఐలో క్రియాశీలకంగా పని చేశారు. యూత్, మహిళా కాంగ్రెస్‍లో పలు హోదాల్లో పనిచేసిన అమె.. ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. గతంలో హైదరాబాద్ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలందించారు. తనపై నమ్మకంతో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పగ్గాలు అప్పగించిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, రాష్ట్ర పార్టీ నేతలకు సునీతారావు కృతజ్ఞతలు తెలిపారు.