సిఎం రేవంత్‌ను కలిసిన సునీల్ పంట్ర, కిరణ్ దుగ్గిరాల

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పర్యటనలో ఉన్న తానా జాయింట్ ట్రెజరర్ సునీల్ పంట్ర, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ కిరణ్ దుగ్గిరాల కలిశారు. ఈ సందర్భంగా ఎన్నారైలు అమెరికా పర్యటన సమయంలో రేవంత్ రెడ్డితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అడిగిన వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చిన రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నారైల విషయంలో ఎప్పుడూ స్పందించే రేవంత్ రెడ్డికి అమెరికాలో కూడా మంచి ఆదరణ ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.