తీహార్ కు స్వాగతం.. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను.. కవితకు సుఖేష్ లేఖ..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసు నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్ ఆమెకు ఓ సుదీర్ఘమైన లేఖ రాశారు. ఇందులో ‘తీహార్ జైల్ క్లబ్ లో మీరు కూడా సభ్యులు కాబోతున్నారు అని ఆయన పేర్కొనడం సెన్సేషనల్ గా మారింది. బీహార్ జైల్ కౌంట్ డౌన్ మొదలైంది.. అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా ఎవరూ కాపాడలేరు. ఇప్పటివరకు సింగపూర్, హాంకాంగ్, జర్మనీ లాంటి ప్రదేశాలలో భద్రంగా దాచుకున్న అక్రమ సొమ్ము మొత్తం బయటకి వస్తుంది…అని సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు వాట్సాప్ సంభాషణల పై కూడా దర్యాప్తు జరుగుతోందని సుకేష్ కవితను హెచ్చరించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని కవితకు అతను సలహా కూడా ఇచ్చాడు. ఈ కేసులో కావలసిన అన్ని సాక్షాలు ఉన్నాయి అన్న విషయం కోర్టుకు బాగా తెలుసు. కాబట్టి ఎలాగో మీకు శిక్ష తప్పదు.. అందుకే మిమ్మల్ని తీహార్ క్లబ్బుకు స్వాగతం పలకడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని సుఖేష్ పేర్కొన్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.