ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కి స్పిరిట్ ఆఫ్ హ్యుమనిటీ అవార్డు
విశ్వగురు అంతర్జాతీయ రికార్డ్స్ సంస్థ ద్వారా స్పిరిట్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డుకు ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎంపికయ్యారు. రాజ్భవన్లో గవర్నర్ తమిళిసౌ సౌందరరాజన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. కరోనా, లాక్డౌన్ సమయంలో హైదరాబాద్ నగరంలో వచ్చిన వరదల సమయంలో రాజకీయాలకతీతంగా, ప్రజలకు చేసిన సేవలతో పాటు అనేక సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటుండడంతో అవార్డుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్వవస్థాపకులు, సీఈవో సత్యవోలు రాంబాబు, డైరెక్టర్ పూజిత, సోషల్ మీడియా ఇంచార్జ్ రమాకాంత్, ఎంఆర్డీసీఎల్ చైర్మన్ ఓఎస్డీ పగడాల శివప్రసాద్, కృష్ణ సాగర్ పాల్గొన్నారు.













