ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి కీలక పదవి
మూసీ నది తీరప్రాంత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా ఎల్బీనగర్ శాసనసభ్యు దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధిత ఉత్తర్వుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా సుధీర్ రెడ్డి కేబినెట్ హోదాలో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎల్బీనగర్ నుంచి గెలుపొందిన సుధీర్ రెడ్డి, ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. గతంలో వైఎస్ హయాంలో హుడా చైర్మన్గా పనిచేసిన అనుభవం సుధీర్ రెడ్డికి ఉంది.













