గోరెటి వెంకన్నకు జాతీయ పురస్కారం
సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రజాకవి, వాగేయకారుడు గోరటి వెంకన్నకు ప్రదానం చేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్వవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సుద్దాల అశోక్‌తేజ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన సుద్దాల హనుమంతు జయంతి సందర్భంగా సుందరయ్య కళా నిలయంలో ఒక ప్రత్యేక ఉత్సవంతో ఈ పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంఎల్‌సి కర్నె ప్రభాకర్ విశిష్ట అతిధులుగా ఆర్.నారాయణమూర్తి, నమస్తే తెలంగాణ సంపాదకులు కట్టా శేఖర్ రెడ్డి పాల్గొనన్నుట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, యువకళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.













