రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సుదర్శన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి.సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జీఏడీ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్‌రాజ్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాలని నిర్ణయించి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. తదుపరి సీఈవోగా నియమించేందుకు వీలుగా ముగ్గురు అధికారుల జాబితాను పంపగా, సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసింది.