అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదు.. సీఎం రేవంత్ హెచ్చరిక

హైదరాబాద్‌లో మైట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కొందరు అడ్డుపడుతున్నారని, అలాంటి వారికి నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.148.05 కోట్లతో నిర్మించిన లెవ్-2 ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ నిన్న శంకుస్థాపన చేసిన పాతబస్తీ మెట్రోను ఆపాలని ఎవరో ఢిల్లీకి లేఖ రాశారంట. అభివృద్ధి పనులను అడ్డుకోవాలని చూస్తున్న వారికి నగర బహిష్కరణ తప్పదు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలను హెచ్‌ఎండీఏ పరిధిలోకి తెస్తాం. నగర ప్రజల అవసరాలు తీర్చేలా మెట్రో రైలును విస్తరిస్తాం. భవిష్యత్‌లో నిర్మించే రీజినల్ రింగ్‌రోడ్డుతో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది అని తెలిపారు.