అమెరికా కాన్సులేట్‌లో ఘనంగా స్టూడెంట్ వీసా డే
అమెరికాలో చదువుకునే భారత్ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోందని, గత మూడేళ్లలో 122 శాతం పెరిగిందని అమెరికా కాన్సులేట్ కాన్సులర్ విబాగం ముఖ్య అధికారి డొనాల్డ్ ముల్లిగన్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంలో స్టూడెంట్ వీసా డే కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా జూన్ 8న ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు దేశంలోని నాలుగు కాన్సులేట్లలో విద్యార్థులకు స్వయంగా వీసా ఆమోదం పొందిన పాస్‌పోర్టులను అందజేస్తారు. ఈ సందర్భంగా ముల్లిగన్ మాట్లాడుతూ వీసాలు పొందిన విద్యార్థులను అభినందించారు. గతంలో అమెరికాలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా హాజరై తమ అనుభవాలను వివరించారు.













