అమెరికాలో కాల్పుల ఘటన… ఖమ్మం విద్యార్థి మృతి

అమెరికాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు. చికాగోలో దుండగుల కాల్పుల్లో సాయితేజ (26) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. ఓ సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్న అతడిపై దుండగులు కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. సాయితేజ్ మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.