సమతామూర్తి విగ్రహానికి అరుదైన గుర్తింపు
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో చోటు దక్కింది. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు చినజీయర్ స్వామికి సర్టిఫికెట్ అందజేశారు. రామానుజాచార్యుల విగ్రహానికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు దక్కడం పట్ల చినజీయర్ స్వామి హర్షం వ్యక్తం చేశారు. సమతకు చిహ్నమైన రామానుజాచార్య విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించారు.













