వెటరన్ స్విమ్మర్ శ్యామలను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇటీవలే అమెరికాలోని అత్యంత ప్రమాదకర కేటలీనా చానల్‌ను సాహోసోపేతంగా ఈదిన స్విమ్మర్ గోలి శ్యామలను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. తన కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రపంచంలోని సప్త సముద్రాలను ఈది దేశానికి, రాస్ట్రాన్ని శ్యామల మరిన్ని పేరు, ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. ఎముకలు కొరికే సముద్రపు నీళ్లలో, అత్యంత ప్రమాదకరమైన కేటలీనా ద్వీపం నుంచి లాస్ ఏంజిల్స్ వరకు 36 కి.మీలు ఈదడం సాధారణ విషయం కాదన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్యామల మెండైన ఆత్మవిశ్వాసం కనబరిచి లక్ష్యాన్ని చేరుకున్నారు. అంతర్జాతీయ వేదికలపై శ్యామల సత్తాచాటడం సంతోషంగా ఉంది అని అన్నారు.













