Sridhar Babu: ఆయన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలపై మాజీ మంత్రి హరీశ్‌రావు శాసనసభ (Legislative Assembly)లో మాట్లాడారు. మొత్తం ఆరు డీఏ (DA) లు పెండిరగ్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు. పింఛన్ బకాయిలు రావట్లేదని 39 మంది విశ్రాంత ఉద్యోగులు మరణించారని హరీశ్‌రావు(Harish Rao) అన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్పందించారు. ఉద్యోగుల గురించి హరీశ్‌రావు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. సభ్యుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.






