వేంకటేశ్వర వైభవోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి
ప్రతి ఒక్కరికీ దైవభక్తి, దేశ భక్తి రెండూ చాలా అవసరమని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్య నాయుడు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ శ్రీనివాస కల్యాణం శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవ ప్రాజెక్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో రెండో రోజు వేంకటేశ్వర వైభవోత్సవాలు ఘనంగా జరిగాయి. సుప్రభాత సేవతో పూజలు ప్రారంభమయ్యాయి. వెంకయ్యనాయుడు దంపతులు హాజరయ్యారు. నిర్వహకులను అభినందించారు. సంగీత కచేరీ, కళాకారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. స్వామివారి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.













