కనులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరిగాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ రంజిత్రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపరూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకట్రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.













