భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుక నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాల నడుమ అభిజిత్ లగ్నంలో కల్యాణ క్రతువును వేదపండితులు పూర్తి చేశారు. భద్రాచలం పుర వీధులన్నీ శ్రీరామ నామస్మరణతో మార్మోగాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.