హైదరాబాద్ లో ఘనంగా శ్రీరామనవమి శోభాయాత్ర
హైదరాబాద్ నగరంలో శ్రీరామనవమి శోభయాత్ర ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో భజరంగదల్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ శోభయాత్ర మధ్యాహ్నం 12:30 గంటలకు మంగళ్ఘట్ నుంచి బయలుదేరింది. కొవిడ్ కారణంగా శోభాయాత్ర రెండేళ్లుగా వాయిదా పడిరది. ఈ ఏడాది భారీస్థాయిలో శోభయాత్ర కొనసాగింది. లక్ష మందికి పైగా శోభాయాత్రలో పాల్గొన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా మద్యం అమ్మకాలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.













