ఆయాచితం నటేశ్వరశర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు
ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య అవార్డును 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి జిల్లాకు చెందిన ఆయాచితం నటేశ్వర శర్మకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాశరథి కృష్ణమాచార్య జయంతి సంరద్భంగా ఏటా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటిస్తుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ణయం మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 22న రవీంద్ర భారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ అవార్డుతో పాటు రూ.1,01,116 నగదు, జ్ఞాపికను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయచితం నటేశ్వర శర్మకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.













