వైద్యులకు ప్రత్యేక హోటళ్ళలో బస
తెలంగాణలో కరోనా బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి హోటళ్లలో ప్రత్యేక బస కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులకు, అనుమానితులకు నోటిఫైడ్ దవాఖానాలో పనిచేసే రోజుల్లో విధులు ముగించుకున్న తరువాత నేరుగా ఇంటికెళితే, కుటుంబ సభ్యులకు ఇబ్బంది అవుతుందన్న భావనతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. వీరు హోటళ్లు, హాస్పిటళ్లల్లో ఉన్నన్ని రోజులు కుటుంబానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అందరూ ఒకేసారి రేయింబవళ్లు పనిచేయకుండా, కొందరు కొన్ని రోజులు పనిచేసేలా వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది.













