పీవీ సింధుకు అరుదైన గౌరవం
జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చిత్రంతో తపాలాశాఖ ప్రత్యేక పోస్టల్ కవర్ను రూపొందించింది. హైదరాబాద్లోని ఆమె నివాసంలో సింధు చేతుల మీదుగా తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్ర కుమార్ ఇతర తపాలా ఉన్నతాధికారులతో కలిసి ఈ కవర్ను విడుదల చేశారు. ఖైరతాబాద్ లోని పోస్టాఫీసు ప్రధాన కార్యాలయంలో ఈ పోస్టల్ కవర్ అందుబాటులో ఉంటుందని తపాలా శాఖ పేర్కొంది. దీన్ని గౌరవంగా భావిస్తున్నట్టు సింధు పేర్కొంది.













