హైదరాబాద్ నుంచి బ్లాక్ ఫంగస్ కోసం.. మరో ఔషధం

కరోనా మహమ్మారి మానవ జీవితాలకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇతర ప్రాణాంతక సైమస్యలకూ దారితీస్తోంది. వాటిలో ఒకటి మ్యూకర్ మైకోసిన్ (బ్లాక్ ఫంగస్). హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న ఎస్పీ అక్యూర్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రత్యామ్నాయ ఔషధం అంఫోటెరిసిన్ బి ఎముల్సియన్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మెడిహాక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. గిరీశ్ భట్ మాట్లాడుతూ ప్రస్తుతం పది వేల వయల్స్ను కలిగి ఉన్నాం. సుమారు వెయ్యి మంది రోగులకు చికిత్స చేసేందుకు ఈ స్టాక్ సరిపోతుంది అని అన్నారు.