మిసెస్ ఇండియా గ్లోబ్గా స్నేహారావు
మిసెస్ ఇండియా గ్లోబ్గా భానూర్వాసి స్నేహారావు కొట్టె గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని బీడీఎల్ భానూరు టౌన్షిప్లో నివసించే స్నేహారావు ఈనెల మొదటి వారంలో ఢిల్లీలో జరిగిన మిసెస్ ఇండియా గ్లోబ్-2017 విజేతగా నిలిచారు. తన తదుపరి లక్ష్యం చైనాలో జరిగే మిసెస్ ఇండియా గ్లోబ్ 2017 పోటీలో విజయం సాధించడమేనని స్నేహారావు చెప్పారు. ఇందుకు ఇప్పటి నుంచే పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ పోటీల కోసం ఆమె హైదరాబాద్, ముంబైలో శిక్షణ శిబిరాలకు హాజరవుతున్నారు. అంతర్జాతీయ వేదికపైనా విజయం సాధిస్తానని స్నేహారావు ఆత్మ విశ్వాసంతో చెప్పారు.













