హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం
హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ స్మార్ట్ సిటీల (ఆకర్షణీయ నగరాలు) జాబితాలో స్థానం దక్కించుకున్న భారత్‌లోని మూడు ప్రధాన నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానాన నిలిచింది. ఆ తరువాత ఢిల్లీ, ముంబయిలు నిలిచాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ (ఐఐఎండీ), సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ (ఎస్‌యూటీడీ) సంయుక్తంగా ప్రపంచంలోని కొన్ని ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేసుకొని అక్కడ పౌరులకు లభించే సేవలను మదించి ర్యాంకులు కేటాయించాయి. ఇందుకోసం నగరాల వారీగా వివరాలు సేకరించాయి.
ప్రపంచంలోని మొత్తం 102 ఆకర్షణీయ నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి. మొత్తం 102 నగరాల్లో హైదరాబాద్‌కు 67వ స్థానం (ప్రపంచ ర్యాంకు) లభించింది. ఢిల్లీకి 68, ముంబయికి 78 స్థానాలు దక్కాయి. భారత్‌లోని ఎంపిక చేసిన మూడు నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.













