మరో 6 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం

కోవిడ్ బాధితుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మరో 6 ప్రైవేట్ ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్స రద్దు చేస్తూ తెలంగాణ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పద్మజ ఆస్పత్రి (కేపీహెచ్‌బీ కాలనీ), లైఫ్‌లైన్ మెడిక్యూర్ (అల్వాల్), టిఎక్స్ ఆస్పత్రి (ఉప్పల్), మాక్స్‌కేర్ (హన్మకొండ), లలిత ఆస్పత్రి (వరంగల్), శ్రీసాయిరాం ఆస్పత్రి (సంగారెడ్డి) ఈ జాబితాలో ఉన్నాయి. కోవిడ్ రోగుల నుంచి ఎక్కువ మొత్తం డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తెలంగాణ సర్కార్ కోవిడ్ చికిత్స రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్పత్రులన్నింటికీ షోకాజ్ నోటీసులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 105 ఆస్పత్రులకు తెలంగాణ సర్కార్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.