సీట్ అధికారులు కీలక నిర్ణయం
పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా కమిషన్‌లో పనిచేసే కొంతమంది సభ్యులను విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అనితా రామచంద్రన్, లింగారెడ్డి దగ్గర నిందితులు ప్రవీణ్, రమేశ్‌లు పీఏలుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దర్నీ సిట్ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రవీణ్, రమేశ్‌ను సిట్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ కేసులో టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.













