సిరిసిల్ల నేత కళాకారుడికి గవర్నర్ అభినందనలు
సిరిసిల్ల చేనేత ఉత్పత్తులు, సిరి పట్టుచీరలు రాజ్‌భవన్‌లో తళుక్కుమన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా గవర్నర్ తమిళిసై పిలుపు మేరకు రాజ్‌భవన్‌లో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన చేపట్టారు. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన నేత కళాకారుడు యెల్డి హరిప్రసాద్ రూపొందించిన సిరి పట్టుచీరలను ప్రదర్శించారు. అగిపెట్టేలో ఇమిడే చీరతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఫొటోలతో నేసిన పట్టుచీరలను గవర్నర్ తమిళిసై పరిశీలించారు. నేత కళాకారుడు హరిప్రసాద్‌ను అభినందించారు. సిరిసిల్ల సిరి పట్టుచరీలతో పాటు గద్వాల్ వెంకటగిరి చేనేత కార్మికులు ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు.













