అయోధ్య రామాలయానికి కానుకగా..బంగారు పట్టుచీర
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన ప్రతిభను చూపారు. రాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకొని అన్ని గ్రామాల నుంచి అయోధ్య రామాలయానికి కానుకలు పంపిస్తున్న నేపథ్యంలో తాను కూడా ఏదైనా అందించాలని తాజాగా ఆయన బంగారు పట్టుచీరను తయారు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిప్రసాద్, రేఖ దంపతులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ఈ వేడుకల్లోనే ప్రధానిని కలిసి చీరను చూపించనున్నారు. ఆ తరవాత అయోధ్యలో సమర్పించనున్నారు. కుల వృత్తినే నమ్ముకున్న ఆయన అందులోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు.













