సింగరేణి సీఎండీతో అమెరికన్ ప్రతినిధుల భేటీ
సింగరేణి కాలరీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్‌తో అమెరికన్ రీజినల్ ఎన్విరాన్మెంట్ అధికారుల బృందం భేటీ అయింది. సింగరేణి కాలరీస్ చేపడుతున్న మైనింగ్ పద్ధతులు, పర్యావరణహిత కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా శ్రీధర్ వివరించారు. క్లీన్ కోల్ సరఫరా కోసం వాల్ వాషరీల ఏర్పాటు, వేస్ట్ మేనేజ్మెంట్ చర్యగా ఓవర్ బర్డెన్ నుంచి ఇసుక తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరాయంగా ప్రభుత్వ సంస్థల ద్వారా కాలుష్య కారకాంశాలపై శాస్త్రీయ విశ్లేషణ, పర్యవేక్షణ, తదనుగుణంగా తీసుకొంటున్న జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ రీజినల్ ఎన్విరాన్మెంట్ ప్రతినిధి సారా లిట్కే, అమెరికన్ కాన్సులేట్ జనరల్‌కు చెందిన అన్నె డి సిల్వా, సింగరేణి జీఎం ఆంటోనిరాజా పాల్గొన్నారు.













