సింగరేణి సీఎండీకి ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రతిష్ఠాత్మక ఆసియా పసిఫిక్ ఆంత్రప్రెన్యూర్‌షిప్-2018 అవార్డు సింగరేణి సీఎండీ నడిమెట్ల శ్రీధర్‌ను వరించింది. ఆసియాలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల పనితీరుపై అధ్యయనం చేసిన ఈ సంస్థ మైనింగ్ అండ్ ఎనర్జీ విభాగాల్లో అత్యుత్తమ నాయకత్వం, వ్యాపారాభివృద్ధికి చేసిన కృషికి గాను శ్రీధర్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఢిల్లీలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఇప్పటికే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్న శ్రీధర్ 2016లో వినూత్న ఆవిష్కరణల కింద గోల్డెన్ పికాక్ అంతర్జాతీయ అవార్డునూ అందుకున్నారు.













