సిరిసిల్ల చేనేత కళాకారుడు అద్భుత ప్రతిభ
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరోసారి తన అద్భుత ప్రతిభ చాటారు. అగ్గిపెట్టెలో ఇమిడే, సూది బెజ్జంలో దూరే చీరలను నేసిన హరిప్రసాద్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రాలను పట్టువస్త్రాలపై నేశారు. తాజాగా అగ్గిపెట్టెలో దూరే షర్ట్‌తో పాటు లుంగీని తయారు చేశారు. మల్బర్ సిల్క్‌ను ఉపయోగించి మగ్గంపై నేసిన ఈ వస్త్రాలు వ్యక్తులు ధరించేందుకు వీలుగా ఉంటాయని హరిప్రసాద్ తెలిపారు. వీటి తయారీకి పది రోజుల సమయం పట్టిందని, వీటిలో షర్ట్ 100 గ్రాములు, లుంగీ 140 గ్రాముల బరువు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు హరిప్రసాద్ ప్రతిభను గుర్తించి అభినందిస్తున్నారు.













