మంత్రి పొంగులేటితో వైఎస్ షర్మిల భేటీ
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులను కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. పొంగులేటి నివాసంలో శ్రీనివాస్ రెడ్డి దంపతులను ఆమె కలిసి తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహా వేడుకలకు రావాలని ఆహ్వానించారు. హైదరాబాద్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చిన షర్మిల వారికి వివాహ ఆహ్వాన పత్రికను అందించి కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ నెల 18న వైఎస్ రాజారెడ్డి` ప్రియా అట్లూరి నిశ్చితార్థం, ఫిబ్రవరి 17వ తేదీన వివాహనం ఉన్న విషయం తెలిసిందే.













