ఓరుగల్లులో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు

ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాలి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత భద్రకాళి అమ్మవారు శాకాంబరిగా భక్తులకు దర్శనమివ్వనున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడిరచాయి. ఈ నేపథ్యంలో ఆదివారం దర్శనానికి వచ్చే భక్తులు తమ వాహనాలను ఎల్బీ కాలేజీ గ్రౌండ్, పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్, మున్సిపల్ గ్రౌండ్‌లలో పార్కింగ్ చేసుకోవాలని మట్టేవాడ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తుమ్మ గోపీ సూచించారు.