ఎవరి డబ్బులతో వాటిలో తిరుగుతున్నారో… ఈసీ తేల్చాలి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ రాజకీయ భిక్ష పెట్టిందని ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ కాంగ్రెస్ దౌర్జన్యం చేసి ఉంటే తెలంగాణ ఉద్యమం జరిగేది కాదన్నారు. కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఆందోళన చేయకుండా అణచివేస్తోందని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్, కేటీఆర్, కవిత కోసం 4 హెలికాప్టర్లు తీసుకున్నారు. ఎవరి డబ్బులతో వాటిలో తిరుగుతున్నారో ఈసీ తేల్చాలి. బీఆర్ఎస్ నేతల హెలికాప్టర్ పర్యటనలపై ఈసీకి ఫిర్యాదు చేస్తా. బీఆర్ఎస్ సభలకు ప్రజలు రావడం లేదు. డబ్బులిచ్చి, బలవంతంగా సభలకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్లో ఎవరికీ ఇంకా టికెట్ ఖరారు కాలేదు. ఖరారు కాకుండానే ఎలా అమ్ముకుంటారు? అని అన్నారు.













