మంత్రులకే అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీఆర్.. కామారెడ్డికి వస్తారా?
మంత్రులకే అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ కామారెడ్డికి వస్తారా? అని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీకి సీఎం కేసీఆర్ సిద్ధమైన నేపథ్యంలో షబ్బీర్ అలీ స్పందించారు. తెలంగాణ కోసం పోరాడిన గద్దర్‌ను ప్రగతిభవన్‌కు రానివ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ మహారాష్ట్రలో ఖర్చు చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన టికెట్లలో మహిళలకు 33 శాతం ఎందుకు ఇవ్వలేదు? ఎస్సీలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదు. దళిత ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్కు ఎస్సీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రంలో కేవలం కల్వకుంట్ల పాలనే కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాల మనిషి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఎప్పటికీ ఒక్కటి కాదు అని అన్నారు.













