తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌లకు పదోన్నతి
తెలంగాణలో రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసింది. 2009 బ్యాచ్‌కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్, ప్రశాంతి, సత్యనారాయణ, హర్విందర్ సింగ్‌లకు సెలెక్షన్ గ్రేడ్ పదోన్నతి కల్పించారు. శశాంక, శ్రుతి, ఓజా, శివలింగయ్య, వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్‌కుమార్, హైమావతి, హరితలకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ పదోన్నతి లభించింది. 1997 బ్యాచ్‌కు చెందిన శైలజా రామయ్యర్, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీరబ్రహ్మాయ్య ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2008 బ్యాచ్‌కు చెందిన తఫ్సర్ ఇక్బాల్‌కు డీఐజీగా ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.













