తీన్మార్ మల్లన్నకు 14 రోజుల పాటు రిమాండ్
తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఐపీసీ 306, 511 సెక్షన్స్ పెట్టడం తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పిర్యాదుదారుడు ఎలాంటి ఆత్మహత్యయత్నం చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు పరిశీలిస్తామని తెలిపింది. చిలకలగూడ పోలీసులు 7 రోజుల పాటు కస్టడీ కోరారు. తీన్మార్ నవీన్ తరపు న్యాయవాది ఉమేష్ చంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. చంచల్‌గూడ జైల్‌కి తరలించారు. ఇటీవల డబ్బుల కోసం మల్లన్న బెదిరిస్తున్నాడని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వచ్చే నెల 9 వరకు మల్లన్నకు రిమాండ్ విధించారు.













